Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mana Pattanambadhigo Mana Paurathvambadhigo

మన పట్టణంబదిగో మన పౌరత్వంబదిగో

Mana Pattanambadhigo Mana Paurathvambadhigo

Verse
మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో
కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో
Verse
ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో
ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి
మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము
Verse
జీవ జలనది - పారు నాసనమునుండి
ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు
నెల నెల కాయును - పండ్రెండు కాపులను
Verse
నూతన భువియందు - నూతన యెరూషలేముండు
నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము
నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను
Verse
తేజోమయునితో - మరి తేజోవాసులతో
తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు
సజీవ జనకుని - సజీవ జనులమని
Verse
చేరుదు మాపురము - పరమ పరదైసునకు
కరువు మరణములు - కానము ఎన్నడును
మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము

Related Tags

HeavenHopeEternity