Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mana Prabhuyaesu Vachchedu Vaela Mana Santhosha Hrudayaalu Chaala Velase

మన ప్రభుయేసు వచ్చెడు వేళ మన సంతోష హృదయాలు చాల వెలసె

Mana Prabhuyaesu Vachchedu Vaela Mana Santhosha Hrudayaalu Chaala Velase

Verse
మన ప్రభుయేసు వచ్చెడు వేళ
మన సంతోష హృదయాలు చాల వెలసె
Verse
భూదిగంత నివాసులారా
పదిలముగ ప్రభు యేసుని చూచి
ముదముగ రక్షణ మరి పొందుడి
Verse
వారాయన తట్టు చూడగనే
వారలకు వెలుగు కలిగెను
వారి ముఖంబులు లజ్జింపకుండెన్
Verse
మన విశ్వాసమునకు కర్తయు
కొనసాగించెడి యేసుని చూచి
వినయమున పరుగిడు పందెమున
Verse
శిష్యులు కన్నులెత్తి చూడగను
యేసే కనిపించెను వింతగను
మోషే ఏలియాలు మరుగైరి
Verse
ప్రభుయేసే మన పరిమళ ప్రియుడు
మురిసెదము మన ప్రభువునందు
మెరిసే మహిమలు మన భాగ్యమదే
Verse
మంచి కాపరి మన ప్రభుయేసు
మనకై తనదు ప్రాణము నిచ్చెను
వినుడి మన రక్షకుని పిలుపు
Verse
ఆనందముతో ఆర్భాటముతో
అందమగు శ్రీ యేసుని జూచి
హల్లెలూయా యని పాడెదము

Related Tags

WorshipSecond ComingJesus