Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mana Yaesu Maranasmaa Ranavinduloobalu

మన యేసు మరణస్మా రణవిందులోఁబాలు

Mana Yaesu Maranasmaa Ranavinduloobalu

Lyricist: Dasari Moses
Verse
మన యేసు మరణస్మా రణవిందులోఁబాలు గొనరండు ప్రియులార
వినయమానసులై మన దోష చయమెల్లఁ దనమేన ధరియించు కొనిమనల
గావ నా యన పడిన శ్రమలెంచి‖ మన యేసు ‖
Verse
మరల మన మధ్యకా పరమాత్ముఁడరుదెంచ వఱకాయనను మనము
మఱవకుండుటకై స్థిర భక్తి నద్దాని జరిగింపవలెనంచు గురుతరంబగు
నాజ్ఞ నెఱపితాఁ జనెఁగాన‖ మన యేసు ‖
Verse
తినుఁడిది యె నా దివ్య తనువంచు నొక రొట్టి యను వ్రచ్చి ప్రభుఁ
డిచ్చె ననుబంధుతతికి ఘన శ్రద్ధదానిఁగై కొని మనము భుజియింప
నొన గూడు జిరజీవ మనుమాన మిఁకనేల‖ మన యేసు ‖
Verse
ఆ రీతి నిజరక్త ధారయై వెలయు ద్రా క్షారసము నిచ్చె నిం పార
గొను డనుచుఁ గోరి యా మధుధారఁ గ్రోలిన మనకుక్షి దోరమౌ జీవంపుధార
లుద్భవ మొందు‖ మన యేసు ‖
Verse
ప్రభు భక్తి నెవఁడు దై వభయంబు లేక య నుభవించు వానిక
శుభమౌ నా మీఁద విభవంబు దొలఁగురో గభయంబు చేకూరు శుభ
మవ్వానికి నెపుడు లభియింపదని తెలిసి‖ మన యేసు ‖
Verse
మిము మీరె తగురీతి గమనించి పరిశోధ నము చేసికొని మీ పాపము
లోప్పుకొనుచు నమితార్తిఁబశాత్తా పముఁబొంది యీ విందు క్రమము
బాటింప క్షే మము మీకు సిద్ధించు‖ మన యేసు ‖
Verse
దురితాంధకార భా స్కరుఁడు సద్గురుఁడేసు పరమవిందున కిది యను
ప్రాసంబని యెఱిఁగి ఉరణశాబకరక్త సరి దంతఃపరిపూతాం
బరులైసత్కార్యత త్పరులై బంధురమతులై‖ మన యేసు ‖

Related Tags

WorshipCommunion