Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manakai Yaesu Maranimche Mana Paapamula Korakai

మనకై యేసు మరణించె మన పాపముల కొరకై

Manakai Yaesu Maranimche Mana Paapamula Korakai

Chorus
మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె
Verse
తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను
Verse
మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి
Verse
మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె
Verse
గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును
Verse
దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్
Verse
ఎదిరింప లేదెవరిన్ - లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్
Verse
సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ

Related Tags

SalvationGood FridaySacrifice