Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manaku Jeevamaiyunna Rakshakudu Prabhuyesae

మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే

Manaku Jeevamaiyunna Rakshakudu Prabhuyesae

Chorus
మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే
Verse
దేవుని దీవెనలు పొంద
యౌవనులార యేసుని సన్నిధికి రారండి
దైవకుమారుడు పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
Verse
యేసు నంగీకరించెడి వారి
పేరులు జీవగ్రంథమునందు వ్రాయబడున్
నమ్మకమైయున్న పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
Verse
దేవుని స్వరూపము కల్గిన యేసుప్రభు
మనుజరూపంబున జన్మించెను
చావును గెల్చిన పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
Verse
యేసు రక్తములో కడుగబడిన
తెల్లని వస్త్రముల్ ధరియించి రారండి
గొప్ప కృపానిధి పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
Verse
క్రీస్తు యేసుని యౌవన జనమా
ఆయనకు ప్రాణము లర్పించను నిలువుడి
సత్యరూపియగు పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
Verse
రాజుల రాజు ప్రభుల ప్రభువు
అను పేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెన్
సర్వశక్తిగల పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
Verse
ప్రభుని పిలుపు పొందియున్న
యౌవనులార విశ్వసించి విజయము పొందుడి
శత్రువు నోడించి యేసు నామమున
హల్లెలూయ పాట పాడుడి

Related Tags

PraiseSalvationYouth