Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manalo Prathi Okkari

మనలో ప్రతి ఒక్కరి

Manalo Prathi Okkari

Lyricist: Prabhu Bhushan Pratthipaati
Verse
మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు
మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు‖ 2x ‖
హృదయాంత రంగములో బాధలు తెలుసు
మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు‖ 2x ‖
జగత్తు పునాది వేయబడక ముందే
మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా‖ 2x Manalo ‖
Verse
మనసులోని మాట నీవు పలుకకముందే
ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు
తల్లి గర్భమునందు నిను రూపించకముందే
ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు‖ 2x ‖
సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా
ఆకాశ వీధులలో నీవు విహరించినా‖ 2x ‖
ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా‖ Manalo ‖
Verse
నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా
యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు
నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా
యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు‖ 2x ‖
నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించి
నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు‖ 2x ‖
ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా‖ Manalo ‖

Related Tags

PrayerComfortGods Love