Chorus
మనమే ప్రభుని పరలోక గృహము
తానే వసించును దానియందు
Verse
ఎంత సుందరమో ప్రభుని గృహము
నలుదిక్కులనుండి కూర్చెనుగా
ఏక శరీరము రక్తబంధముచే
వేలాది భాషల నుండినను
Verse
ఒక నూతన వ్యక్తిగా మము జేసె
పరమ గృహమునకు చెందితిమి
ఐక్యతతో స్థిరముగ నమర్చబడి
దేవుని గుడారముగా నైతిమి
Verse
నల్లని తెల్లని వారని లేదు
ధనికులు దరిద్రులనియు లేదు
పామరులని జ్ఞానులని లేదు
యేసు ప్రభువే సర్వముగా
Verse
ప్రభుని గృహమున కలహము లేదు
ఈర్ష్య కపట భేధము లేదు
శాంతి ఆనందము నిజ ప్రేమయుండును
నేర్పుతో నడుపును మన ప్రభువే
Verse
ప్రభుని గృహము యిద్ధరయందున్నది
తన దాసుల కధికారమిచ్చె
ప్రతివానికి వాని పని నియమించె
కావలి యుండుము మెలకువతో
Verse
దృఢ విశ్వాసము మదినందుంచి
విజయులలై యాత్రలో సాగెదము
ఆదర్శులమై ఈ జగమందున
పూర్తిగ శత్రువు నోడింతుము
Verse
ప్రియుని దినము సమీపించు చున్నది
చెప్పెను మేల్కొని యుండుమని
విశ్వాస యోగ్యులముగ జీవించి
ఓరిమితో వేచియుండెదము