Verse
మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనముల
నీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి‖ మనమీ ‖
Verse
మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింక
వడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి‖ మనమీ ‖
Verse
ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కర
నాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి‖ మనుమీ ‖
Verse
సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడ
ఇష్టము తోడను వేఁడి నీదు దుష్ట గుణమ్ముల వీడి‖ మనుమీ ‖
Verse
చెంతఁ జేర వల దన్నాఁడ కడు వింతెన జనకుఁడు గాఁడా చింతలు
నీకిఁక నేల బహు సంతోషమున యేసు పాల‖ మనుమీ ‖
Verse
బిరబిర వరగురు దరికి నీ వరుగుము దురితముఁ బెరికి సురిచిరమగు
యేసు కరుణ నీకు మరణపు తరి నగు నాదరణ‖ మనుమీ ‖
Verse
నిరతమ్ము నాతనిమీఁద నీదు దురితముల నునుపరాద త్వరితమ్ముగ
నెమ్మిఁ జూపి దుష్ట చరితమ్మును వెళ్లబాపి‖ మనుమీ ‖
Verse
అమలాప్తుఁడు నిను డాయు నీదు శ్రమ లన్నియు వెడలఁ జేయు
విమలాత్మను దయచేయ నీతి కమలాప్తుని మది కీయ‖ మనుమీ ‖
Verse
అంచితముగ నుతి సేయు నిన్ రక్షించిన కృపా సంస్త్యాయు
నెంచుచు నాతని విభునిగఁ గీర్తించుచుఁ బరమ గురునిగ‖ మనుమీ ‖