Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manamesuni Vaaramu Thanavaarigaane Yundumu

మనమేసుని వారము తనవారిగానే యుందుము

Manamesuni Vaaramu Thanavaarigaane Yundumu

Verse
మనమేసుని వారలము - తనవారిగానే యుందుము
మనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము
Verse
కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను
కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో
తన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము
Verse
వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను
మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారనే
ప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము
Verse
దైవపుత్రుండు సజీవరాళ్ళతో - యింటిని కట్టుచున్నాడు
దేవుని తేజము రాగా - మహిమతో నిండె గృహము
ఆయన మందిరములో - తన మహిమను పాడెదము
Verse
ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను
పిలిచి నీతిగా తీర్చి - మహిమ పరచెను
తన తనయుని రూపమిచ్చె - మన మానంద మొందెదము
Verse
పూర్ణమహిమతో మనప్రభు యేసు - దూతలతో వచ్చును
కనిపెట్టు వారెత్తబడెదరు - తన మహిమ పొందెదరు
తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము
Verse
మహిమ నివసించు మహిమ రాజ్యంబు
మహిమతో నిండి యుండును
మన ప్రభువే దీపమై యుండును
తన వెలుగు ప్రచురమగున్
యుగయుగములు మనమంతా
ప్రభుయేసుతో నుండెదము

Related Tags

PraiseWorshipChristian Life