Verse 1
Reference: తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను John 1:14
Chorus
మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి
Verse
తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమ
వలె ఆయన మహిమను - కనుగొంటిమి
Verse
నీవు నమ్మిన యెడల - దేవుని మహిమ చూతువు
జీవ పునరుత్థానము యేసు
Verse
ప్రత్యక్షగుడారమును - మేఘము కమ్మగానే
యెహోవా తేజస్సు నిండెను
Verse
దేవుని నివాసము - మనుజులతో నున్నది
నివసించు - దేవుడే వారిలో
Verse
మహిమా ప్రభావముతో - మకుటము ధరించిన క్రీస్తు
తనయులను తెచ్చె మహిమకు
Verse
మన రక్షణ కర్తను శ్రమతో - సంపూర్ణుని జేయ
మన తండ్రికే తగియున్నది
Verse
మన చులకని శ్రమలు - రాబోవు మహిమ యెదుట
ఎన్నతగినవి కావు
Verse
పరిశుద్ధ పట్టణములో - దేవునికే మహిమ
ప్రభువునకే మహిమ హల్లెలూయ