Chorus
మనస యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరుఁ జూడవే యా
ఘనునిఁ గూడవే నిను మనుప జచ్చుటరసియే మరక వేఁడవే‖ మనస ‖
Verse
అచ్చి పాపములను బాప వచ్చినాఁడఁట వా క్కిచ్చి తండ్రితో నా
గెత్సెమందున తాఁ జొచ్చి యెదను నొచ్చి బాధ హెచ్చుగనెనఁట‖ మనస ‖
Verse
ఆ నిశోధ రాత్రి వేళ నార్భటించుచు న య్యో నరాంతకుల్ చేఁ
బూని యీటెలన్ ఒక ఖూని వానివలెను గట్టి కొంచుఁబోయిరా‖ మనస ‖
Verse
పట్టి దొంగవలెను గంత గట్టి కన్నులన్ మరి గొట్టి చెంపలన్
వడిఁ దిట్టి నవ్వుచున్ నినుఁ గొట్టి రెవ్వ రదియు మాకుఁ జెప్పుమనిరఁట‖ మనస ‖
Verse
ముళ్లతోడ నొక కిరీట మల్లి ప్రభుతలన్ బెట్టి రెల్లు కఱ్ఱతో నా కల్ల
జనములు రా జిల్లు మనుచుఁ గొట్టి నవ్వి గొల్లు బెట్టిరా‖ మనస ‖
Verse
మొయ్యలేక సిల్వ భరము మూర్ఛ బోయెనా అ య్యయ్యో జొక్కెనా
యే సయ్య తూలెనా మా యయ్యనిన్ దలంపగుండె లదరి పోయెనా‖ మనస ‖
Verse
కాలు సేతులన్ గుదించి కల్వరి గిరిపై నిన్ గేలిఁజేయుచు నీ
కాళ్లమీఁదను నినుప చీలలతోఁ గ్రుచ్చి నిన్ను సిల్వఁ గొట్టిరా‖ మనస ‖
Verse
దేవ సుతుఁడ వైతి వేని తెవరంబుగా దిగి నీవు వేగమే రమ్ము
గావు మనుచును ఇట్లు గావరించి పల్కు పగర కరుణఁజూపెనా‖ మనస ‖
Verse
తన్నుఁ జంపు శత్రువులకు దయను జూపెనా తన నెనరు జూపెనా
ప్రభు కనికరించెనా ఓ జనక యీ జనుల క్షమించు మనుచు వేఁడెనా‖ మనస ‖
Verse
తాళలేని బాధ లెచ్చి దాహ మాయెనా న న్నేలువానికి నా పాలి
స్వామికి నే నేల పాపములను జేసి హింస పరచితి‖ మనస ‖
Verse
గోడు బుచ్చి సిలువపైన నేడు మారులు మా ట్లాడి ప్రేమ తో నా
నాఁడు శిరమును వంచి నేఁడు ముగిసె సర్వ మనుచు వీడె బ్రాణము‖ మనస ‖
Verse
మరణమైన ప్రభుని జూచి ధరణి వణఁకెనా బల్ గిరులు బగిలెనా
గుడి తెరయుఁ జీలెనా దివా కరుఁడు చీఁక టాయె మృతులు తిరిగి లేచిరి‖ మనస ‖
Verse
ఇంత జాలి యింత ప్రేమ యింత శాంతమా నీ యంతఃకరుణను
నేఁ జింత చేయఁగా నీ వింత లెల్ల నిత్య జీవ విధము లాయెనా‖ మనస ‖