Chorus
మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు
క్షీణం బగుచున్నది గదవే‖ మనసా ‖
Verse
చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక
యెంతసేపు నీ యంతట నుండెదవే‖ మనసా ‖
Verse
లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన
ప్రభువును ప్రాకటముగ నమ్ము‖ మనసా ‖
Verse
మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమని
నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా‖ మనసా ‖
Verse
రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియే
సమయము తక్షణమున వేఁడు‖ మనసా ‖
Verse
అందరమును గూడి యేసుని మందిరమునఁ జేరి పొందుగ క్రీస్తుని
పొగడుచుఁ బాడుచు నందునఁ జేరుదము‖ మనసా ‖