Verse
మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న
అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై
యుండును‖ మన ‖
Verse
దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న
పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును‖ మన ‖
Verse
సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి
స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది‖ మన ‖
Verse
తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న
యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన‖ మన ‖
Verse
క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న
సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు‖ మన ‖
Verse
పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న
పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ
గును‖ మన ‖