Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manaserigina Yesayyaa

మనసెరిగిన యేసయ్యా

Manaserigina Yesayyaa

Verse
మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు‖ 2x ‖
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు‖ 2x మనసెరిగిన ‖
Verse
నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా‖ 2x ‖
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు‖ 2x మనసెరిగిన ‖
Verse
వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా‖ 2x ‖
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు‖ 2x మనసెరిగిన ‖
Verse
మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా‖ 2x ‖
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు‖ 2x మనసెరిగిన ‖

Related Tags

WorshipHolinessJesusDevotion