Verse
మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు ప్రభున్
Verse
విరివిగ నాశీర్వాదము లొసగున్
మరువకు యేసుని యుపకారం
ధర నీకున్నది దేవునిదే యని
కోరిన ప్రబుకిడు త్వరపడుచు - ఘనంబు‖ ఘనంబు ‖
Verse
దర్శించిన నీ దయగల ప్రభువునకు
హర్షముతో కొట్లను విప్పి
విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు
అర్పించి కొనియాడెదము - ఘనంబు‖ ఘనంబు ‖
Verse
తనయునిలో మన కన్నియు నిడెను
మనలను ముందే తనకిడెను
పానార్పణముగ ప్రభుకర్పించి
కాలంబంతయు గడిపెదము - ఘనంబు‖ ఘనంబు ‖
Verse
సంతసముగ నిడుటే ప్రభు చిత్తము
ఎంతో మెళకువతో నుండి
చింతింపక నిడుటే సరియర్పణ
వింతగు వృద్ధిని పొందెదము - ఘనంబు‖ ఘనంబు ‖
Verse
పిసినితనంబుగ దోషార్పణ నిడ
వాసము చేయును లేశములు
యేసునికి నీ జీవనమియ్యను
శాసనమిదె ప్రభుదని యెరుగు - ఘనంబు‖ ఘనంబు ‖
Verse
ఘనపరచును ప్రభు - మనస్సారగ నిడ
కానుకగా బలకాలములు
మన కెన్నో తన గుణముల నిడి
ఘనమును బలమును ప్రభువొసగున్ - ఘనంబు‖ ఘనంబు ‖
Verse
మకెదొనియ సంఘము వలె నీకు
సకల ఇక్కట్లుండినను
శక్తికి మించి సాగిన గాని
మక్కువగా నిడి మనమిలను - ఘనంబు‖ ఘనంబు ‖