Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manasu Nichchi Vinumaa Madhi Nanusarim

మనసు నిచ్చి వినుమా మది ననుసరిం

Manasu Nichchi Vinumaa Madhi Nanusarim

Lyricist: Chetti Bhanumurthy
Chorus
మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా‖ మనసు ‖
Verse
అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ
యది యనుసరించినావ అది యరసి చూచినావ?‖ మనసు ‖
Verse
అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ
మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును‖ మనసు ‖
Verse
రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స
ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట‖ మనసు ‖
Verse
ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది
ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన‖ మనసు ‖
Verse
సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి
దుర్గుణహారి మనకోటకు రహదారి‖ మనసు ‖
Verse
వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని
బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల‖ మనసు ‖

Related Tags

DevotionalCrossJesusDiscipleship