Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manasulokataaye Bhuvilo

మనసులొకటాయే భువిలో

Manasulokataaye Bhuvilo

Lyricist: Michael Kalyanapu
Verse
మనసులొకటాయే భువిలో
ఇరువురొకటాయే హృదిలో‖ 2x ‖
మనసు పరవశమై మధుర లాహిరిలో‖ 2x ‖
మనసులోని భావాలు
ఉరకలు వేసే ఈ వేళా‖ మనసులొకటాయే ‖
Verse
ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట
దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా‖ 2x ‖
ఈ మధురమైన శుభవేళ‖ 2x ‖
ఒకరికొకరు తోడు నీడగా
సాగే ఈ తరుణం‖ మనసులొకటాయే ‖
Verse
అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై
జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా‖ 2x ‖
ఘన యేసుని దివ్య ఆశీస్సు‖ 2x ‖
జీవితాంతం నిండుగ మెండుగ
నీతో నిలిచే ఈ తరుణం‖ మనసులొకటాయే ‖

Related Tags

BlessingMarriageWedding