Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manava Roopamunu Dharinchi Arudhenche Yesu Ihamunaku

మానవ రూపమును ధరించి అరుదెంచె యేసు ఇహమునకు

Manava Roopamunu Dharinchi Arudhenche Yesu Ihamunaku

Verse
మానవ రూపమును ధరించి - అరుదెంచె యేసు ఇహమునకు
ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే
Verse
కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్
శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్
వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్
ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే
Verse
చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకై
యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై
యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా
ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే
Verse
సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందను
కన్నీటిని విడుచుచును దూరముగా నీవుందువా?
నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకురా
ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే

Related Tags

GospelSalvationJesus