Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manche Leni Naa Paina

మంచే లేని నా పైన

Manche Leni Naa Paina

Lyricist: A R Stevenson
Verse
మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు‖ 2x ‖
ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు‖ 2x ‖
పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి‖ 2x ‖
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా‖ 2x మంచే లేని ‖
Verse
లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు‖ 2x ‖
నీదెంత దీన మనస్సు
నా కెంత ఘనత యేసు‖ 2x ఎంతగా ‖
Verse
నాశనమైన నన్ను రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు‖ 2x ‖
నీలోన జాలి పొంగె
నాలోన శాంతి నిండె‖ 2x ఎంతగా ‖
Verse
చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు‖ 2x ‖
నీ సాటిలేని త్యాగం
నా పాలి గొప్ప భాగ్యం‖ 2x ఎంతగా ‖

Related Tags

PraiseGraceSalvation