Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manchi Devudu Bhale Manchi Devudu

మంచి దేవుడు భలే మంచి దేవుడు

Manchi Devudu Bhale Manchi Devudu

Chorus
మంచి దేవుడు భలే మంచి దేవుడు
నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు
Verse
మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలును
కొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడు
వెదికితే ప్రతి వారికి - దొరికేను యేసు
పిలిచే ప్రతి వారికి - పలికేను యేసు
బొమ్మ కాదయ్యో - జీవమున్న దేవుడు‖ మంచి ‖
Verse
కుంటివాడు గంతులేయ - కాళ్ళ నొసగినాడు
మూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడు
బధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడు
ప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు‖ మంచి ‖
Verse
చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెను
అడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెను
మరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెను
ఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెను
ఏమి చేతువో - సృష్టికర్త యేసుని‖ మంచి ‖

Related Tags

PraiseWorship