Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manchi Devudu Naa Yesayyaa

మంచి దేవుడు నా యేసయ్యా

Manchi Devudu Naa Yesayyaa

Verse
మంచి దేవుడు నా యేసయ్యా
చింతలన్ని బాపునయ్యా
హృదయ వాంఛతో చేరిన వారికి
శాంతి జీవము ఇచ్చునయ్యా‖ 2x ‖
మహిమా ఘనత ప్రభావము నీకే‖ 2x ‖
Verse
కృపల వెనక కృపను చూపి
విడువక నీ కృపలను చూపిన‖ 2x ‖
కృపగల నా యేసు రాజా
నీ కృప నాకు చాలునయ్యా‖ 2x మహిమా ‖
Verse
మహిమ వెంట మహిమ నొసగి
నీ రూపమున నన్ను మార్చి‖ 2x ‖
మహిమతో నీవుండు చోటుకి
మమ్ము ప్రేమతో పిలచితివి‖ 2x మహిమా ‖
Verse
జయము వెంట జయమునిచ్చి
జయ జీవితము మాకు ఇచ్చి‖ 2x ‖
జయశీలుడు నా యేసు ప్రభువని
జయము జయమని పాడెదను‖ 2x మహిమా ‖

Related Tags

PraiseWorshipGrace