Chorus
మంచి కాపరి మాప్రభు యేసే....
మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరి
మరణ మన్నను భయము లేదులే
మదురమైన ప్రేమతో మమ్ము కాయులే
Verse
పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా
శాంతి జలాల చెంత అడుగు వేయగా
చేయివిడువకా తోడు నిలచును
నీతి మార్గమందు మమ్ము నడువజేయును‖ మంచి ‖
Verse
అందకారలోయలో మా పయనంలో
లేదులే మాకు భయం అభయం తానే
ఆదరించును ఆశీర్వదించును
అన్ని తావులయందు తానే తోడైయుండును‖ మంచి ‖
Verse
శత్రువుల మధ్యలో మాకు భోజనం
అభిషేకం ఆనందం కృపా క్షేమమే
బ్రతుకు నిండగా పొంగి పొర్లగా
చిరకాలం ఆయనతో జీవింపగా‖ మంచి ‖