Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manchi Snehithuda Manchi

మంచి స్నేహితుడా మంచి

Manchi Snehithuda Manchi

Verse
మంచి స్నేహితుడా మంచి కాపరివి‖ 2x ‖
అగాధ జలములలో నేను నడచినను
అరణ్య యానములో నేను తిరిగినను
నన్ను ఆదరించినావు ఓదార్చినావు
చేర దీసినావు కాపాడినావు‖ 2x ‖
నీకే ఆరాధన – నీకే ఆరాధన‖ 2x ‖
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన‖ 2x ‖
Verse
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు
ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు‖ 2x ‖
ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు
ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు‖ ఆరాధన ‖
Verse
చెరలో ఉన్న నన్ను విడుదల చేసినావు
బంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు‖ 2x ‖
నాలో ఉన్న నిన్ను లోకానికి చూపినావు
నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా నిలిపినావు‖ ఆరాధన ‖
Verse
ఒంటరియైన నన్ను వేయిమందిగా చేసితివి
ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మార్చితివి‖ 2x ‖
నన్ను హెచ్చించినావు నా కొమ్ము పైకెత్తినావు‖ 2x ‖

Related Tags

WorshipGuidanceShepherd