Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manchi Snehithudu

మంచి స్నేహితుడు

Manchi Snehithudu

Lyricist: Suresh Vanguri
Verse
మంచి స్నేహితుడు‖ 2x ‖
హితమును కోరే బ్రతుకును మార్చే
ప్రాణస్నేహితుడేసు‖ 2x మంచి స్నేహితుడు ‖
Verse
ఒరిగిన వేళ పరుగున చేరి
గుండెలకదిమే తల్లవుతాడు
అక్కరలోన పక్కన నిలిచి
చల్లగ నిమిరే తండ్రవుతాడు
ఒంటరితనమున చెలిమవుతాడు
కృంగిన క్షణమున బలమవుతాడు‖ 2x మంచి స్నేహితుడు ‖
Verse
చీకటి దారుల తడబడు ఘడియల
వెచ్చగ సోకే వెలుగవుతాడు
పతనపు లోయల జారిన వేళల
చెయ్యందించే గెలుపవుతాడు
శోధనలోన ఓర్పవుతాడు
శోకంలో ఓదార్పవుతాడు‖ 2x మంచి స్నేహితుడు ‖