Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manchini Panche Daarokati

మంచిని పంచే దారొకటి

Manchini Panche Daarokati

Verse
మంచిని పంచే దారొకటి
వంచన పెంచే దారొకటి
రెండు దారులలో నీ దారి
ఎంచుకో బాటసారి
సరి చూసుకో ఒక్కసారి‖ 2x ‖
Verse
మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడు
ప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు‖ 2x ‖
పాపికి రక్షణ తెస్తాడు
పరలోక రాజ్యం ఇస్తాడు‖ 2x ‖
అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా
విశాల మార్గం వద్దయ్యా‖ మంచిని ‖
Verse
మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడు
కామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు‖ 2x ‖
దేవుని ఎదిరిస్తుంటాడు
నరకాగ్నిలో పడదోస్తాడు‖ 2x ‖
అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా
విశాల మార్గం వద్దయ్యా‖ మంచిని ‖

Related Tags

SalvationChristian LifeChoice