Chorus
మంచివాడా మంచివాడా
చాల చాల మంచివాడా
Pre-Chorus
నీదు కృపనే ధారాలముగ
మాపై కుమ్మరించువాడా
Verse
పాపిగ నేనుండకూడదని
నా కొరకే నీవు దిగివచ్చావు
దోషిగ నేనుండకూడదని
నా శిక్ష యావత్తు నీవు పొందావు
నీ త్యాగముతో మార్చి రక్తముతో కడిగి
నను శుద్ధునిగ చేసి యోగ్యునిగ చేసి
నిత్యజీవమునే అందించావు
నీ యొక్క కరుణనే కుమ్మరించావు
Verse
ఉగ్రత నాపై రాకూడదని
నీతిమంతునిగ తీర్చివేసావు
శత్రువు నేమాత్రం కాను అని
సమాధానముతో నింపివేసావు
నీ హస్తముతో కాచి రెక్కలలో దాచి
శుద్ధత్మునినే పంపి నను దైర్యముతో నింపి
నా విశ్వాసమునే స్తిరపరిచావు
నీ యొక్క ప్రేమనే కుమ్మరించావు