Verse
మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు
మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి‖ 2x ‖
ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో‖ 2x మంచివాడు ‖
Verse
ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు
దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును‖ 2x ఆదరణ ‖
Verse
ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా
యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును‖ 2x ఆదరణ ‖
Verse
దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు
నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను‖ 2x ఆదరణ ‖
Verse
ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం
సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో‖ 2x ఆదరణ ‖