Verse
మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా
రమ్మనే యేసు ప్రార్ధించుము - నడిపించును
Verse
అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు
Verse
అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు
Verse
నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నన్ను ప్రేమించెడి హృదయములు - నాకు కావలె నీ విచ్చెదవా