Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mandiramuloniki Raarandi

మందిరములోనికి రారండి

Mandiramuloniki Raarandi

Verse
మందిరములోనికి రారండి
వందనీయుడేసుని చేరండి‖ 2x ‖
కలవరమైనా కలతలు ఉన్నా‖ 2x ‖
తొలగిపోవును ఆలయాన చేరను
కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను‖ మందిరము ‖
Verse
దేవుని తేజస్సు నిలిచే స్థలమిది
క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది‖ 2x ‖
వెంటాడే భయములైనా
వీడని అపజయములైనా‖ 2x తొలగిపోవును ‖
Verse
సత్యము భోదించు దేవుని బడి ఇది
ప్రేమను చాటించు మమతల గుడి ఇది‖ 2x ‖
శ్రమల వలన చింతలైనా
శత్రువుతో చిక్కులైనా‖ 2x తొలగిపోవును ‖
Verse
శాంతి ప్రసాదించు దీవెన గృహమిది
స్వస్థత కలిగించు అమృత జలనిధి‖ 2x ‖
కుదుటపడని రోగమైనా
ఎదను తొలిచే వేదనైనా‖ 2x తొలగిపోవును ‖

Related Tags

WorshipPeaceChurch