Chorus
మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు
జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై
కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ‖ మంగళ ‖
Verse
ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ
డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ
మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి‖ మంగళ ‖
Verse
సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద
దేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకు
ముదముతో గనుపడిన ప్రభునకు‖ మంగళ ‖
Verse
ధరణి న్గొల్చెడి దాసజ నములనుఁబ్రోచు దైవ తనయుఁడని నిజ
మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి
జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు‖ మంగళ ‖