Verse
మంగళమే యేసునకు – మానుజావతారునకు‖ 3x ‖
శృంగార ప్రభువునకు‖ 2x ‖
క్షేమాధిపతికి మంగళమే‖ మంగళమే ‖
Verse
పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు‖ 3x ‖
నిరుపమానందునకు‖ 2x ‖
నిపుణ వేద్యునకు మంగళమే‖ మంగళమే ‖
Verse
దురిత సంహారునకు – వర సుగుణోదారునకు‖ 3x ‖
కరుణా సంపన్నునకు‖ 2x ‖
జ్ఞాన దీప్తునకు మంగళమే‖ మంగళమే ‖
Verse
సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు‖ 3x ‖
నిత్య స్వయంజీవునకు‖ 2x ‖
నిర్మలాత్మునకు మంగళమే‖ మంగళమే ‖
Verse
యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి‖ 3x ‖
సత్య పరంజ్యోతి యగు‖ 2x ‖
సార్వభౌమునకు మంగళమే‖ మంగళమే ‖
Verse
నర ఘోర కలుషముల – నురుమారంగ నిల‖ 3x ‖
కరుదెంచిన మా పాలి‖ 2x ‖
వర రక్షకునకు మంగళమే‖ మంగళమే ‖
Verse
పరమపురి వాసునకు – నర దైవ రూపునకు‖ 3x ‖
పరమేశ్వర తనయునకు‖ 2x ‖
బ్రణుతింతుము నిన్ను మంగళమే‖ మంగళమే ‖