Chorus
మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు
క్షేమాధిపతికి‖ మంగళమే ‖
Verse
పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ
వద్యునకు‖ మంగళమే ‖
Verse
దురిత సంహారునకు వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు
జ్ఞానదీప్తునకు‖ మంగళమే ‖
Verse
సత్య ప్రవర్తునకు సద్దర్మశీలునకు నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు‖ మంగళమే ‖
Verse
యుక్తస్తోత్రార్హూనకు భక్తరక్షామణికి సత్యపరంజ్యోతి యగు
సార్వభౌమునకు‖ మంగళమే ‖
Verse
నరఘోర కలుషముల నురుమారంగ నిల కరుదెంచిన మాపాలి వర
రక్షకునకు‖ మంగళమే ‖
Verse
పరమపురి వాసునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు
బ్రణుతింతుము నిన్ను‖ మంగళమే ‖