Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mangalame Yesunaku Manujavatharunaku

మంగళమే యేసునకు మనుజావతారునకు

Mangalame Yesunaku Manujavatharunaku

Verse
మంగళమే యేసునకు - మనుజావతారునకు‖ 3x ‖
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే
...మంగళమే...
Verse
పరమపవిత్రునకు - వరదివ్యతేజునకు‖ 3x ‖
నిరుపామనందునకు - నిపుణవైద్యునకు - మంగళమే‖ 2x ...మంగళమే... ‖
Verse
దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు‖ 3x ‖
కరుణా సంపన్నునకు - జ్ఞాన దీప్తునకు మంగళమే‖ 2x ...మంగళమే... ‖
Verse
రాజులపై పాజునకు - రవి కోటి తేజునకు‖ 3x ‖
బూజార్హ పదాబ్జునకు - భువనావన మీకు మంగళమే‖ 2x ...మంగళమే... ‖
Verse
సత్యప్రవర్తనకు - సద్ధర్మశీలునకు‖ 3x ‖
నిత్య స్వయం జీవునకు - నిర్మలాత్మునకు మంగళమే‖ 2x ...మంగళమే... ‖

Related Tags

PraiseWorshipJesus