Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mangalame Yesunaku Manujavatharunaku

మంగళమే యేసునకు మనుజావతారునకు

Mangalame Yesunaku Manujavatharunaku

Chorus
మంగళమే యేసునకు - మనుజావతారునకు
శృంగార ప్రభువున - కు క్షేమాధిపతికి
Verse
పరమ పవిత్రునకు - వరదివ్య తేజునకు
నిరుప మానందునకు - నిపుణ వేద్యునకు
Verse
దురిత సంహారునకు - వరసుగుణోదారునకు
కరుణా సంపన్నునకు - జ్ౙానదీప్తునకు
Verse
సత్య ప్రవర్తునకు - సద్ధర్మ శీలునకు
నిత్యాస్వయంజీవునకు - నిర్మలాత్మునకు
Verse
యుక్తస్తోత్రార్హునకు - భక్త రక్షామణికి
సత్యపరంజోతియగు - సార్వభౌమునకు
Verse
పరమపురి వాసునకు - నరదైవ రూపునకు
పరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నీకు

Related Tags

PraiseWorshipJesus