Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mangalame Yesunaku Manujavatharunaku

మంగళమే యేసునకు మనుజావతారునకు

Mangalame Yesunaku Manujavatharunaku

Chorus
మంగళమే యేసునకు - మనుజావతారునకు‖ 3x ‖
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే
Verse
పరమపవిత్రునకు - వరదివ్యతేజునకు‖ 3x ‖
నిరుపామనందునకు - నిపుణవైద్యునకు - మంగళమే‖ 2x ‖
Verse
దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు‖ 3x ‖
కరుణా సంపన్నునకు - జ్ఞాన దీప్తునకు మంగళమే‖ 2x ‖
Verse
రాజులపై పాజునకు - రవి కోటి తేజునకు‖ 3x ‖
బూజార్హ పదాబ్జునకు - భువనావన మీకు మంగళమే‖ 2x ‖
Verse
సత్యప్రవర్తనకు - సద్ధర్మశీలునకు‖ 3x ‖
నిత్య స్వయం జీవునకు - నిర్మలాత్మునకు మంగళమే‖ 2x ‖
Verse
యుక్త స్తోత్రార్హునకు - భక్త రక్షామణికి‖ 3x ‖
సత్య పరంజ్యోతియగు - సార్వభౌమునకు మంగళమే‖ 2x ‖
Verse
పరమ పురి వాసునకు - నర దైవ రూపునకు‖ 3x ‖
బరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నీకు మంగళమే‖ 2x ‖

Related Tags

PraiseWorship