Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mangalamubaadare Kreesthunaku Jaya Mam

మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మం

Mangalamubaadare Kreesthunaku Jaya Mam

Lyricist: Purushothamu Choudari
Chorus
మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా
మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు
సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును‖ మంగళము ‖
Verse
రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున
సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ‖ మంగళము ‖
Verse
కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును
దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి
వాఁడని శుభ మంగళము‖ మంగళము ‖
Verse
సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని
భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు
ఆమేనిని మంగళము‖ మంగళము ‖

Related Tags

PraiseWorship