Verse
మనిషి బ్రతుకు రంగుల వలయం
ఆ బ్రతుకే క్షణ భంగురం‖ 2x ‖
మారాలి ప్రతి హృదయం
వెదకాలి క్రీస్తు రాజ్యము‖ 2x మనిషి ‖
Verse
గడ్డి పువ్వురా మనిషి జీవితం
గాలి వీచగా రాలిపోవును‖ 2x ‖
గాలిలో నిలువని దీపమురా ఇది
గాలిలో ఎగిరే గాలిపటం రా‖ 2x ‖
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని‖ 2x మనిషి ‖
Verse
ఆత్మ వెళ్లగా శవమని నిన్ను
ఇంట నుంచరు పంచ చేర్చెదరు‖ 2x ‖
ఇరుగు పొరుగువారు కూడ కొందరు
వల్లకాటి వరకే వచ్చెదరు‖ 2x ‖
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని‖ 2x మనిషి ‖
Verse
ధనమున్నదని గర్వించకురా
ధనమే నీకు తోడు రాదురా‖ 2x ‖
లోకమే నీకు అశాశ్వతంబురా
పరలోకమే నీకు శాశ్వతంబురా‖ 2x ‖
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని‖ 2x మనిషి ‖