Verse
మన్నేగదయ్యా మన్నేగదయ్యా‖ 2x ‖
మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప
మహిలోనిదంతా మన్నేగదయ్యా‖ 2x మన్నేగదయ్యా ‖
Verse
మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా
మించిన బంగారము మించిన నీ దేహము‖ 2x ‖
ఉంచుము ఎన్నాళ్ళకుండునో
మరణించగానే మన్నేగదయ్యా‖ 2x మన్నేగదయ్యా ‖
Verse
ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా
నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా‖ 2x ‖
మెల్లని పుష్పంబు పోలినా
పుష్పంబుతోనే ఊడిపడినది‖ 2x మన్నేగదయ్యా ‖
Verse
మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము
ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము‖ 2x ‖
కుక్క శవంతో సమమేగా
నిక్కముగనదియు మన్నేగదయ్యా‖ 2x మన్నేగదయ్యా ‖
Verse
మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల
మరణమును జయించుచున్న కాలమింత మన్నిల‖ 2x ‖
మరణ విజయుడేసు క్రీస్తుడే
మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును‖ 2x మన్నేగదయ్యా ‖