Chorus
మనోవిచారము కూడదు నీకు - మహిమ తలంపులే కావలెను
దిన క్రమాన శాంతి గుణంబులు - దీనుల కిచ్చు చుందును
Verse
ఆలస్యమైనంత మాత్రమున - అవి నెరవేరవనవద్దు
కాలము పరిపూర్ణంబు కాగా - ఖచ్చితముగా అన్నియు నెరవేరును
Verse
నిత్యానందము సత్యానందము - నీలోనే నే నమర్చితి
అత్యానందము అగపడుచుండును - ఆలోచించు చున్న కొలది
Verse
కోరవు నీకు కావలసినవి - ఊరకనే నీకిచ్చెదను
ధారాళముగా నిచ్చుటకు నా - ధన నిధి వస్తువు లన్నియు గలవు
Verse
నీరసపడకుము నీరస పడకుము - నీవే నా ఆస్తి గదా
నా రక్తముతో సంపాదించితి - నన్ను నీ ఆస్తిగ గైకొనుము
Verse
నీకు కావలసినవి అడుగుము - నేను తప్పక ఇచ్చెదను
నీకు ఇచ్చుట నాకానందము - నీవు అడుగుట ముచ్చట నాకు