Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manovilasithambau Dhinambu Mahimanvitha

మనోవిలసితంబౌ దినంబు మహిమాన్విత

Manovilasithambau Dhinambu Mahimanvitha

Lyricist: E G Anandamu
Chorus
మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహరంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు‖ మనో ‖
Verse
మందమారుతములందము నొసగగ డెందములకు నానందము నిడగా
సుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా‖ మనో ‖
Verse
అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరా
వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా‖ మనో ‖
Verse
పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబు
లలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో‖ మనో ‖
Verse
రయమున నొలీవ నగంబుగనుమా రభసయుక్తమగు జనమును గనుమా
జయంజయంబను జయ ధ్యానంబులు వియదంతము జనమ్రోగుట వినుమా‖ మనో ‖
Verse
ప్రసన్నవదనుడు భానుతేజుడు అసంఖ్యజనగణ పరివృతబలుడు
ప్రసితరాసభాసీనుడు యేసుడు అసమ శాంతితో నరుదెంచెనహో‖ మనో ‖
Verse
జయములు బాడెడు బాల చయముతో సాత్వికుడై రాసభంబు నెక్కి
జయోత్సవంబుతో సర్వేశ్వరుడు చనిహృదయము సమర్పించె దము‖ మనో ‖

Related Tags

WorshipPalm SundayJesus Entry