Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manujulaara Manchi Vaartha - Maanugaanu Dechinaada

మనుజులార మంచి వార్త – మానుగాను దెచ్చినాడ

Manujulaara Manchi Vaartha - Maanugaanu Dechinaada

Chorus
మనుజులార మంచి వార్త – మానుగాను దెచ్చినాడ
మనలన్ గావ మహిని నేడు – మనుజుడై జన్మించె నహహ
Verse
ఎంతో సంతసంబు గలిగె – నింతయని వర్ణింప దరమా
చింతలన్ని వీడి ప్రభుని – చెంతజేరి నుతించుమయ్యయ్యో‖ మనుజులారా ‖
Verse
బేతలేము పురమునందు – బీద యింట స్థలములేక
దాత పశులశాలయందు – బ్రీతితో బరుండె నయ్యయ్యో‖ మనుజులారా ‖
Verse
ఒక్క క్షణములోనే దూతల్ – గ్రక్కున మోక్షంబు విడచి
ఒక్క స్వరముతోను బాడి – మక్కువ నుతించిరయ్యయ్యో‖ మనుజులారా ‖
Verse
సంతసంబని తాళములతో – యేసు జన్మదినమునందు
సంతసంబు సంతసంబు – సంతసంబని బాడు డహాహా‖ మనుజులారా ‖

Related Tags

ChristmasNativity