Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manulu Maanikyamulunna Maedam

మణులు మాణిక్యములున్నా మేడమిద్ద

Manulu Maanikyamulunna Maedam

Chorus
మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా
మదిలో యేసులేకున్నా ఏది ఉన్నా అది సున్నా‖ మణు ‖
Verse
చదువులెన్నో చదివివున్నా పదవులెన్నో చేస్తున్నా
విద్యవున్నా బుద్ధివున్నా జ్ఞానమున్నా అది సున్నా‖ మణు ‖
Verse
అందచందా లెన్నున్నా అండములపై కూర్చున్నా
సుందరుడు ప్రభులేక యున్నా అందమున్నా అది సున్నా‖ మణు ‖
Verse
రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు వీర్యము
లున్నా బలము ఉన్నా బలగమున్నా ఎన్నివున్నా అవి సున్నా‖ మణు ‖
Verse
పూజ్యుడా పుణ్యాత్ముండా పుణ్యకార్య సిద్ధుడా
దానధర్మము జపము తపము యేసులేనిది అదిసున్నా‖ మణు ‖

Related Tags

FaithDevotionalChristian