Verse
మరణము గెలిచెను మన ప్రభువు
మనుజాళి రక్షణ కోసము‖ 2x ‖
ఎంత ప్రేమ, ఎంత త్యాగం
జయించె సమాధిని‖ 2x మరణము ‖
Verse
పాపపు ఆత్మల రక్షణకై
గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై‖ 2x ‖
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు‖ 2x ‖
ఎంత జాలి, ఎంత కరుణ
యికను మన పైన‖ 2x మరణము ‖
Verse
నేడే పునరుద్దాన దినం
సర్వ మానవాళికి పర్వ దినం‖ 2x ‖
పాపపు చెర నుండి విడుదల‖ 2x ‖
ఎంత ధన్యం, ఎంత భాగ్యం
నేడే రక్షణ దినం‖ 2x మరణము ‖