Verse
పల్లవి: మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ‖ 2x ‖
ఎంత ప్రేమ, ఎంత త్యాగం, జయించె సమాధినీ‖ 2x ‖
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ
Verse
పాపపు ఆత్మల రక్షణకై - గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై‖ 2x ‖
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు‖ 2x ‖
ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన‖ 2x ‖
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ‖ 2x ‖
Verse
నేడే పునరుద్దాన దినం - సర్వ మానవాళికి పర్వ దినం‖ 2x ‖
పాపపు చెర నుండి విడుదల‖ 2x ‖
ఎంత ధన్యం, ఎంత భాగ్యం - నేడే రక్షణ దినం‖ 2x ‖
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ‖ 2x ‖