Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maranamu Gelichina Naa Daivamaa

మరణము గెలిచిన నా దైవమా

Maranamu Gelichina Naa Daivamaa

Lyricist: Bro Nissi Samuel Lingibheri
Chorus
ఆనంద గానాల నా స్నేహమా
మరణము గెలిచిన నా దైవమా
విశ్వాస విజయపు సంకేతమా
పునరుద్ధానపు ఆధారమా
Verse
ఘనపరతును
కీర్తింతును
నీ విజయ వాక్కును
ప్రకటింతును
Verse
మరణపు ముల్లును
నా కొరకు విరిచి మృత్యువు గెలిచిన
మహనీయుడవు
మదిలో వాక్యము
స్థిరపరచినావు
మందసమువై
నడిపించినావు
పునరుద్ధానము
జీవము నీవే
మరణించినను
జీవించినావు
ఆత్మతో నింపితివే నన్ను అభిషేకించితివే
Verse
ఫలభరితముగా
నను మార్చుటకు
ఆత్మ ఫలముతో దీవించినావు
గమ్యమెరుగని
నా గామనమందు
నా గురి నీవై
నడిపించినావు
నా పాపమునకై
శాపముగా మారి
నీ రుధిరమునే
ప్రోక్షించినావు
ప్రేమను చూపితివే నాకై త్యాగము చేసితివే

Related Tags

PraiseWorshipEaster