Verse
మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు‖ 2x ‖
నీ కృప సమృద్ధిగా
నాపై నిలిపి తోడైయున్నావు‖ 2x మరణము ‖
Verse
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే‖ 2x ‖
నను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా‖ 2x మరణము ‖
Verse
నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి‖ 2x ‖
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా‖ 2x మరణము ‖
Verse
నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము‖ 2x ‖
నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా‖ 2x మరణము ‖
Verse
నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి‖ 2x ‖
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా‖ 2x మరణము ‖