Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maranamu Nannemi Cheyaledu Paristhiti Nannemi Cheyagaladu

మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు

Maranamu Nannemi Cheyaledu Paristhiti Nannemi Cheyagaladu

Verse
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు
నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు‖ 2x ‖
Verse
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే
నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
Verse
నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి
విశ్వాసింపబోవు వారికీ మాదిరిగా నేనుండటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
Verse
నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ద పేదలను ఆదరింప కృపనిమ్ము
నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
Verse
నీ కొరకు ఖైదీ నై వుండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా

Related Tags

FaithGraceSufferingPurpose