Verse
మాయలోక మాయలో నేల ముంగి తిరిగెదవు
కాయము నిన్ను మోసముచేయు కాలమాయెను
Chorus
మరణము వచ్చున్ మరణము వచ్చున్
లోకము ముగియున్ మానవులపై
కృపకాలము దాటిపోవును
Verse
పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెను
ప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను
Verse
వేదవాక్యము మారక - పూర్తియగును
దేవకోపము మానవులపై - పోయబడును
Verse
లోకము దిగుల్ కలహములతో తత్తరిల్లును
మేఘమందు యేసు రాజు కానిపించును
Verse
యేసు నేనే మార్గం సత్యం జీవము నేనే
మోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్
Verse
పాపికై మరణించిన యేసు కాచి నిల్చెను
పాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా