Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maranamun Jayinchi Lechenu Mana Prabhu

మరణమున్ జయించి లేచెను మన ప్రభు

Maranamun Jayinchi Lechenu Mana Prabhu

Lyricist: Murari David
Chorus
మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ
మొనరఁ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి
కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని‖ మరణమున్ ‖
Verse
మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు
దినోదయమునఁ బ్రియ మగు గురుని దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ
దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ‖ మరణమున్ ‖
Verse
నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను
మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ
జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు‖ మరణమున్ ‖
Verse
వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల
భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార
భయపడకు డటంచు నూరడించె నుచితముగను‖ మరణమున్ ‖
Verse
కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు
చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు
రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె‖ మరణమున్ ‖
Verse
మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును
గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు
దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు‖ మరణమున్ ‖
Verse
మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య
వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ
పదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు‖ మరణమున్ ‖
Verse
అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము
వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు
లేపు నమల దేహముల నొసంగు‖ మరణమున్ ‖

Related Tags

ResurrectionEasterJesus Christ