Chorus
మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది
యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా‖ మరణ ‖
Verse
క్షయమందు విత్తఁబడి య క్షయమునందు లేచురా ప్రియుడు క్రీస్తునందు
మృతులు పెం పొసంగు ధన్యులు‖ మరణ ‖
Verse
లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను
యేసు ప్రేమతో దాఁటించురా‖ మరణ ‖
Verse
ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము పరమ దేవుని డుండునట్టి
పరదైసునకుఁ బోదుము‖ మరణ ‖
Verse
గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల
నొక్క క్షణములో బ్రతికించురా‖ మరణ ‖
Verse
బూర రావ మాలకించి భూమి యెల్ల వణఁకురా వారధిలో మృతులు
జీవ ధారులై లేచెదరురా‖ మర ‖
Verse
భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు ముర్తి కిరీటము
ధరించి రక్తితో జీవింతురు‖ మరణ ‖
Verse
కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుఁడి మరణవిజయుఁడైన
ప్రభుని చరణములు నుతించుఁడీ‖ మర ‖